మహిళలకు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు లోపు ఉన్న మహిళలకు, పెన్షన్ సౌకర్యం

0
4

కోడుమూరు లో ఘనంగా . ఉదయం నుండి ఎర్రజెండాలు పట్టణం పురవీధులలో కట్టి ,మహాసభ ప్రాంగణంలో ఎర్ర తోరణాలతో ముస్తాబు చేసి ఎర్రజెండాను ఎగురవేశారు. , ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం, మంచినీటి సమస్య పరిష్కారం కోసం పోరాటం, గుండ్రేవుల రిజర్వాయర్ పూర్తికై పోరాటం చేస్తాం అంటూ ,భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు .అనంతరం మహాసభ ప్రాంగణం తుల్జా భవాని దేవాలయం ముందు అక్కడ ఏర్పాటు చేసిన జెండాను, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి మాధవస్వామి ఎగురవేశారు .అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాసభకు మండల కార్యదర్శి బి రాజు అధ్యక్షత వహించగా, ఆహ్వానితులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య ,ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ ,ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మునెప్పలు విచ్ చేసినారు . ఈ సందర్భంగా మహాసభ ఉద్దేశించి వారు మాట్లాడుతూ ,దేశంలో రాష్ట్రంలో విచ్చిన్నకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రజలకు ,కార్మికులకు రైతులకు ,వ్యవసాయ కూలీలకు భద్రత లేదని వారు తెలిపారు .దేశంలో ఎక్కడ చూసినా అల్లర్లు పెరిగిపోయాయని వారన్నారు .రాష్ట్రంలో ప్రజానీకం వలసలు పోతున్న ,కూలీలను నివారించలేకపోతుందని, రైతులను ఆదుకోవడంలో, కార్మికుల ఆదుకోవడంలో విఫలమైందని వారన్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోయాయని పేదలు ఉపాధికి కరువయ్యారని వారన్నారు .అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ,సూపర్ సిక్స్ పథకాలను తక్షణమే అమలు చేసి అందరిని ఆదుకుంటామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఒక్క పెన్షన్లతోనే సరిపోయింది తప్ప అన్ని అబద్ధపు మాటలతో పరిపాలన కొనసాగిస్తుందని వారు తెలిపారు .మహిళలకు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు లోపు ఉన్న మహిళలకు, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని, అలాగే ఉచిత బస్సుతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ,విద్యార్థులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని ,రైతులను ఆదుకుంటామని, కూలీలను ఆదుకుంటామని, అబద్ధపు ప్రకటనలతోనే పరిపాలన కొనసాగిస్తుంటే తప్ప ,వేరేదేమీ లేదని వారు విమర్శించారు. రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా అతివెనుకబడిన ప్రాంతమని ,కరువుతో అల్లాడిపోతున్నారని, వారిని ఆదుకోవడంలో ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కొనసాగిస్తోందని వారు తెలిపారు. ఈ మహాసభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, బి కృష్ణ ,ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి డి శేషు కుమార్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఎం చిన్న రాముడు ,సిపిఐ జిల్లా మహిళా సమాఖ్య నాయకురాలు సులోచనమ్మ ,ఆటో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి మధు, మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు దూల భాస్కర్, గడ్డం నాగరాజు, వీరితోపాటు వర్కురూగ్రామం నుండి, పాలకుర్తి గ్రామం నుండి, వెంకటగిరి ,కృష్ణాపురం తదితర ప్రాంతాల నుండి కార్యకర్తలు విరివిగా హాజరయ్యారూ. పట్టణంలోని అన్ని శాఖల నుండి భారీ ఎత్తున కార్యకర్తలు ,మహిళలు పాల్గొన్నారు.