ఆల్వాల్ డివిజన్ లోని హరిజనబస్తిలో సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించిన, కార్పొరేటర్. ఎమ్మెల్యే,

0
14

 

అల్వాల్ డివిజన్లోని హరిజన బస్తి లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి. జలమండలి, ఇంజనీరింగ్, అధికారులతో కలిసి పర్యటించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. 

 

ఈ పర్యటనల్లో స్థానికులు ఎమ్మెల్యే  దృష్టికి పలు  సమస్యలు తీసుకువచ్చారు.

బస్తిలో నీటి బకాయి బిల్లులు మాఫీ చేయాలి. ఓల్డ్ ఆల్వాల్ లోని హరిజన బస్తి గ్రామ కంఠం స్థలంలో పూర్వీకులు కాలం నుండి నివసిస్తున్న వారికి ఇంటిపట్టాలు లేకపోవడంతో సరైన ఆధారాలు లేక ఇంటి కొరకు తీసుకున్న త్రాగునీరూ కనెక్షన్కు ఎక్కువ నీటి బిల్లుల వస్తున్నాడంతో సమస్యగా మారి పేద ప్రజల పైన భారమై కట్టలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. నీటి బిల్లులు మాఫీ చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా , వారు కొత్తగా నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అందుకు నీటి మీటర్లకు అయ్యే ఖర్చులో తన వంతు ఆర్థిక సహాయం చేస్తానని తెలియజేశారు.  మహిళా భవన్ లో ఉపాధి కల్పనకు కృషిచేసి మహిళా భవనం అందుబాటులో ఉండే విధంగా కృషి చేయాలని కోరగా ఆయన స్పందించారు. ప్రాపర్టీ టాక్స్ అధికంగా వస్తుందని తెలుపడంతో వెంటనే సంబంధిత అధికారికి తెలియజేసి పరిశీలించాలని తెలిపారు. వీధి దీపాలు వేయించాలని, అలాగేలోతట్టు ప్రదేశాలలో డ్రైనేజీ, సిసి రోడ్డు సమస్యలను పరిష్కరించాలని, పారిశుద్ధ నిర్వహణ చేయించాలని తెలిపారు. సికింద్రాబాద్ నుండి ఓల్డ్ అల్వాల్ వెళ్లే 21 W బస్సును ఓల్డ్ ఆల్వాల్ హరిజన బస్తి పోచమ్మ గుడి వరకు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. స్టాటిస్టిక్ వాటర్ ట్యాంకు నల్లాలు బిగించాలని మరమ్మత్తులు చేయించాలని  విద్యుత్ లైన్ లకు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను అడ్డు తొలగించాలని అనగానే..వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.  ఈ  కార్యక్రమంలో జలమండలి మేనేజర్ కృష్ణమాచారి, లైన్మెన్ రమేష్, ఏఈ వరుణ్ దేవ్, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్,లడ్డు నరేందర్ రెడ్డి, జేఏసీ సురేందర్ రెడ్డి, డోలి రమేష్, డిల్లీ పరమేష్, లక్ష్మణ్ యాదవ్, శోభన్, శరణగిరి, అరుణ్, యాదగిరి గౌడ్, వెంకటేష్ యాదవ్, సందీప్ అరవింద్, మహేష్ , పవన్, శ్రీధర్ గౌడ్, ఆరిఫ్, రహమత్ ,సాజిద్, సురేష్ , స్థానిక బస్తివాసులు చంద్రశేఖర్ హరికుమార్, యాదగిరి, వెంకటేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.