రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

0
7

సికింద్రాబాద్: యువతే మన భారతదేశానికి బలం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు… సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళా లో కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు… మోడీ కలలు కంటున్న వికసిత భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడం లో యువత పాత్ర కీలకం అన్నారు… ఇప్పటివరకు 15 విడతలలో దేశ వ్యాప్తంగా సుమారు 10లక్షల 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని,  ఈరోజు మరో 51 వేల మందికి కేంద్ర విభాగాలలో నియామక పత్రాలు అందచేయడం సంతోషంగా ఉందన్నారు.. ఉద్యోగాల కోసం వేచి చూడటం కన్నా ఉద్యోగాలను సృష్టించేలా యువతను ప్రోత్సహించాలి..అనేది మోడీ గారి ఆలోచన అని కిషన్ రెడ్డి అన్నారు.