తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలు

0
20

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్ 

 

మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ సారథి  ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతిని పురస్కరించుకుని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…“తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ సర్ చేసిన త్యాగాలు, ఆలోచనలు ఎప్పటికీ ఆదర్శప్రాయమైనవే. వారి కలల తెలంగాణను సమగ్ర అభివృద్ధితో తీర్చిదిద్దడమే మనందరి కర్తవ్యంగా భావించాలి” అని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

   -సిద్దుమారోజు