కాంగ్రెస్ యువ నాయకులు బిఆర్ఎస్ లో చేరిక.

0
19

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / మల్కాజిగిరి 

మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ నగర్ డివిజన్‌లోని సమతా నగర్‌కు చెందిన కాంగ్రెస్ యువ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమంలో  మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే  చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ యువ నాయకులకు బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన వారు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వైస్ ప్రెసిడెంట్ ధర్మేష్ యాదవ్.  యువ నాయకులు సంపత్ యాదవ్, భాను యాదవ్. తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి గట్టి నాయకత్వం చూపుతున్న మర్రి రాజశేఖర్ రెడ్డి పని తీరు నమ్మకాన్ని కలిగించిందని, భవిష్యత్‌ రాజకీయ ప్రయాణాన్ని బీఆర్ఎస్ పార్టీతో కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, పంజా శ్రీకాంత్ యాదవ్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   -sidhumaroju