కర్నూలు జిల్లా, మండల కేంద్రమైన గూడూరు పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కుసినేని గిడ్డయ్య, కుసినేని సావిత్రి దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించిన కుసినేని తనూజ ఐదవ తరగతి వరకు గూడూరు పట్టణంలోని జ్యోతి పబ్లిక్ హై స్కూల్లో, పదవ తరగతి వరకు గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు .ఈ పాఠశాలలో పదవ తరగతిలో అత్యధికంగా మార్పులు దక్కించుకున్నందుకు అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో నిర్వహించిన ప్రతిభా అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో జిల్లా నుంచి మొదటి స్థానంలో నిలిచి ముఖ్యమంత్రి నుంచి అవార్డు అందుకున్నారు .ఆ తర్వాత కర్నూలు నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు. ఐదు సంవత్సరాల క్రితం నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో ప్రతిభను కనపరిచి కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు దక్కించుకున్నారు .ఈ నెల మూడవ తేదీ నీట్ పీజీ ప్రవేశ పరీక్షను జాతీయస్థాయిలో నిర్వహించారు .ఈ పరీక్షలో 573 మార్కులు సాధించి జాతీయస్థాయిలో 6675 ర్యాంకు దక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో ఈ ర్యాంకు రావడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, ఉపాధ్యాయులు ,అధ్యాపకులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో నీట్ పీజీ పరీక్షలు రెండు సెషన్స్ లో నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది ఈనెల మూడవ తేదీ ఒకే సెషన్స్ లో జాతీయస్థాయిలో పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షలు రాసిన విద్యార్థులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరికీ వారి ప్రతిభ ఆధారంగా మార్కులు రావడంతో ఈ విధానాన్ని ఆమోదిస్తూ సర్వత్ర హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు .కాగా నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపరిచిన వారికి మొదట జాతీయ స్థాయిలో 50 శాతం కోటా కింద మెడికల్ పిజి సీట్లు భర్తీ చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర కోటాలో పీజీ మెడికల్ సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు