Saturday, August 23, 2025
spot_img
HomeSouth ZoneTelanganaమున్సిపాలిటీలు సమగ్రామాభివృద్దే ద్యేయం: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

మున్సిపాలిటీలు సమగ్రామాభివృద్దే ద్యేయం: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

 

 

 మెదక్ జిల్లా: మెదక్.  అన్ని వార్డులలో పౌర సౌకర్యాలు పెంపొందించి మోడల్ మున్సిపాలిటీగా రూపొందించాలి మున్సిపాలిటీ పరిధిలో వార్డులు వారీగా  తిరుగుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలపై తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మైనంపల్లి.  మెదక్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. వార్డులు వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. మున్సిపాలిటీలో వార్డులు వారిగా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను తెలుసుకోవడం జరిగిందని అన్నారు. అన్ని వార్డులలో పౌర సౌకర్యాలను పెంపొందించడం ద్వారా మోడల్ మునిసిపాలిటీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ఆ దిశగా ముందుకు పోతున్నామన్నారు. అన్ని వార్డులలో డ్రైనేజీ, సిసి రోడ్లు, తాగునీటి సౌకర్యాలు ఉండేలా చూడాలని ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   -sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments