సికింద్రాబాద్ జిల్లా: కంటోన్మెంట్. కరుణ, ప్రేమ, సేవ వంటి మానవత్వపు సహజ గుణాలు సమాజానికి ఎల్లప్పుడూ అవసరమని తన జీవితం ద్వారా తెలియజెప్పిన మహోన్నత మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరెసా జయంతి సందర్భంగా సికింద్రాబాద్ మోండా డివిజన్ లోని మదర్ థెరీసా విగ్రహానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి సేవా నిరతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ టెంపుల్ కమిటీ చైర్మన్ లు అరవింద్ యాదవ్ గౌరీ శంకర్, నాయకులు నంది కంటి రవి, వెంకట్ రాజు శ్రీనాథ్ శేఖర్ ముదిరాజ్, ధనలక్ష్మి వరలక్ష్మి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
– SIDHUMAROJU