జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగను మూడు రోజులపాటు జరుపుకోవాలని మంగళవారం ఎస్సై చిరంజీవి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు పట్టణంలో గతంలో వినాయక చవితి పండుగను నిర్వాహకులు మూడు రోజులపాటు జరుపుకునే వారన్నారు. ఈ ఏడాది వినాయక పండుగ సంబరాలను ఐదు రోజులపాటు జరుపుకుంటామని నిర్వాకులు తన దృష్టికి తీసుకొని వచ్చారన్నారు. అయితే ఆదోనిలో వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని ఐదు రోజులకు జరుపుతున్నందున పోలీసులు బందోబస్తును గూడూరులో జరిగే వినాయక నిమజ్జనానికి భద్రత సిబ్బందిని ఏర్పాటు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుందని కావున వినాయక కమిటీ నిర్వాహకులు , పోలీసు సిబ్బందికి సహకరించి మూడు రోజులపాటు వినాయక ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. దీంతో పాటు ఫైర్, విద్యుత్ శాఖల అధికారుల వద్ద నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు /మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన పోలీసు సిబ్బందిని జిల్లా అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కావున వినాయక మండపాల కమిటీ నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించి మూడు రోజులపాటు ఉత్సవాలను జరుపుకునే విధంగా దృష్టి పెట్టాలని ఆయన కోరారు.