మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యుత్, ఆర్థిక శాఖ, మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకై నిధులు కేటాయింపు, విద్యుత్ సబ్ స్టేషన్ ల ఏర్పాటు , అలాగే ప్రజావసరాల సమస్యలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అదే విధంగా, వెంకటాపురం డివిజన్ యాదమ్మనగర్లోని పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల వారు నివసించే ప్రాంతంలో విద్యుత్ బల్క్ మీటర్లు ఏర్పాటు చేయాలనీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై వినతిపత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే అభ్యర్థనకు ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మల్కాజ్గిరి ప్రజల సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Sidhumaroju