గూడూరు, ఆగష్టు 31, ప్రభాతవార్త: కె. నాగలాపురం పోలీస్ స్టేషన్
పరిధిలోని పెద్దపాడు గ్రామం దగ్గర ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణమ్మ (40) దుర్మరణం చెందింది. సి.బెళగల్ మండలం పొలకల్ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, భార్య అరుణమ్మలు ద్విచక్రవాహనంపై కర్నూలుకు బయల్దేదారు. వీరు పెద్దపాడు గ్రామం దగ్గర ఉన్న మలుపు దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న ఎపి 39 7875 అనే కారు స్పీడ్‌గా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా భర్త వెంకటేశ్వరరెడ్డికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే కె.నాగలాపురం పోలీసులు హుటా హుటిన సంఘటనా వలానికి చేరుకొని పరిస్థితిని సమీకించారు. అనంతరం గాయం