హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన మహాకవి దాశరధి కృష్ణమాచార్యుల శతజయంతి సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అవార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తాల పద్మ జలంధర్ గౌడ్ కు సేవా భూషణ్ జాతీయ స్థాయి ఆవార్డును లయన్ డా. జి మహేంద్ర కుమర్, డిస్ర్టిక్ట్ గవర్నర్, 320-ఎ, లయన్ డా. ఇ.యస్. సత్యనారాయణ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. అనంతరం సేవా భూషణ్ జాతీయ అవార్డు గ్రహీత జలంధర్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ అవార్డు నాకు రావడం ఎంతో సంతోషంగా గర్వకారణంగా ఉందన్నారు . ఈ అవార్డు రావడం నాపై మరింత బాధ్యతని పెంచుతుందనీ అన్నారు. ప్రస్తుతం పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం అనేక విషపూరితమైన వాయువుల వల్ల పర్యావరణం ప్రకోపించడం ఓజోన్ పొర మందగించి పోవడంతో సూర్యుడు ద్వారా వచ్చే కిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల జీవకోటి అనారోగ్య పాలవుతుందని తెలిపారు.ప్రస్తుతం పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో.. ఎప్పుడు ఎండ ఉంటుంది, ఎప్పుడు వర్షం పడుతుంది.. అనేది తెలియకుండా పోతుందనీ వెల్లడించారు. ప్రస్తుతం స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందనీ దానిని అధిగమించాలంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ, తమ పుట్టినరోజు పెళ్లిరోజు మరియు ప్రత్యేకమైన రోజులలో తమకు వీలైన చోట మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా ప్రయత్నం చేసినట్లయితే. పచ్చదనాన్ని పెంచుకోవడంతో పాటు గ్లోబల్ వార్మింగ్ ను అడ్డుకట్ట వేసినవారమవుతాం అలాగే ప్రతి ఇంటి వద్ద షాపుల వద్ద మొక్కలను, చెట్లను పెంచే వారికి ప్రభుత్వం పన్నుల్లో రాయితీలు ఇస్తే అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో మక్తాల ఫౌండేషణ్ సభ్యులు మక్తాల పద్మవతి, కె. వెంకటేష్, అంజనేయులు, ఎ. కృష్ణ తదితరులు పాల్గోన్నారు.
SIDHUMAROJU