అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో సోలార్ పరిశ్రమకు సేకరించిన భూముల వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పర్యటన చేస్తున్న రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దూషించడం చాలా దుర్మార్గమని, కూటమి ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావులేవన్న సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే రైతులకు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారికి వెంటనే క్షమాపణ చెప్పి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి జే, మోహన్, సిఐటియు మండల నాయకులు కే రాజశేఖర్, రైతు సంఘం నాయకులు మద్దిలేటిలు డిమాండ్ చేశారు,
అనంతరం వారు మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో రైతులకు నష్టం కలిగించే విధంగా చర్యలు చేపడుతున్నాడని జగన్ మోహన్ రెడ్డి పైన ప్రచారం నిర్వహించి,నేడు రైతుల భూములను అప్పనంగా సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టుల కోసం బలవంతంగా భూసేకరణ చేసి రైతులను ఎమ్మెల్యే భయభ్రాంతులకు గురిచేయడం, చాలా దుర్మార్గమని అక్కడికి వెళ్లిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారిని అధికార దాహంతో గుమ్మనూరు జయరాం ఫోన్ చేసి బెదిరించడం దుర్మార్గమని గతంలో గుమ్మనూరు జయరాం పైన అనేక రకాలుగా ఆరోపణలు ఉన్నాయని,
ఇటువంటి దుర్మార్గుడు ప్రజాసేవలో కొనసాగడం సరైనది కాద ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకుని, ఇచ్చిన మాటల కోసం కట్టుబడి ఉండాలి తప్ప ఎవరైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన,వారిని బెదిరించే దుర్మార్గుడిని ఇంకా పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని వెంటనే కూటమి ప్రభుత్వం నిజంగా రైతుల పక్షపాతిగా ఉంటుందో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పక్షాన ఉంటుందో తెల్చుకోవాలని రాబోయే కాలంలో గుమ్మనూరు జయరాం లాంటి వ్యక్తులకు అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వానికి రైతులు, ప్రజలు,కార్మికులు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రైతులకు న్యాయం చేయాలని నిరంతరం రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న ప్రభాకర్ రెడ్డి గారిని అధికారం ఉందని అహంభావంతో ఫోన్ చేసి బెదిరించడం ఏంటని, ఇలాంటి దుర్మార్గులకు కూటమి ప్రభుత్వం అండగా ఉండడం అంటే రైతులను విస్మరించడమేనని, గుమ్మనూరు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని,, రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేస్తే ఊరుకునేది లేదని,
ఈ దుర్ఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పైన కఠిన చర్యలు తీసుకుని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు*