గణేష్ ఉత్సవాలు ఐక్యతకు ప్రత్యేకంగా నిలుస్తాయి : బిఆర్ఎస్ నాయకులు శంబీపూర్ కృష్ణ.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: వినాయక చవితి ఉత్సవాల భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్‌పల్లి మరియు మల్లంపేట్ లో పలు అసోసియేషన్ సభ్యులు వారు ఏర్పాటు చేసిన గణనాథులని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు. భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనాలు జరుపుకోవాలని యువతకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు ఎల్లుగారి సత్యనారాయణ, భరత్ కుమార్,మాదాస్ వెంకటేష్, సీనియర్ నాయకులు సగ్గిడి శ్రీనివాస్, వార్డు ప్రెసిడెంట్లు సగ్గిడి నర్సింగ్ రావు, శ్రీధర్, దుండిగల్ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ శివ యాదవ్, మునిసిపల్ యూత్ ప్రెసిడెంట్ మైసిగారి శ్రీకాంత్, మాజీ వార్డు సభ్యులు బాలకృష్ణ, నాయకులు వెంకటేష్, ఎల్లుగారి శ్రీను, సద్దాం, వరాల రాము, వెంకట్ రావు, గౌస్, రాజేష్, రాము, జయంత్, యోగి, స్థానిక నాయకులు, అసోసియేషన్ సభ్యుల, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
SIDHUMAROJU