Home South Zone Telangana జూబ్లీ బస్ స్టేషన్ ను మోడల్ బస్ స్టేషన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే శ్రీ...

జూబ్లీ బస్ స్టేషన్ ను మోడల్ బస్ స్టేషన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే శ్రీ గణేష్

0

సికింద్రాబాద్:  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బుధవారం జూబ్లీ బస్ స్టేషన్ డిపో, కంటోన్మెంట్ బస్ డిపో లలో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డిపో అధికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులు ,పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా బస్ స్టేషన్ లోకి వచ్చే బస్సులు మెయిన్ గేటు లో ఆపి ప్రయాణికులను దించడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతుందని, కంటోన్మెంట్ బోర్డు వారి స్థలాన్ని కొంత ఇప్పిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అధికారులు చెప్పడంతో ఎమ్మెల్యే వెంటనే కంటోన్మెంట్ సీఈఓ గారితో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కంటోన్మెంట్ బోర్డు స్థలాన్ని అవసరమైతే ఆర్టీసీ వారికి నామ మాత్రపు ఫీజుతో లీజుకు ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించడంతో వారు కూడా ఈ సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పానికి మహిళా శక్తి పధకం ద్వారా కంటోన్మెంట్ నియోజకవర్గం లోని మహిళలకు బస్సులను ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని, అదనపు బస్సులు అవసరమైతే నా దృష్టికి తీసుకువస్తే మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి అందిస్తామని,ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా నా దృష్టికి తీసుకువస్తే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో, ఉన్నతాధికారులతో మాట్లాడతానని తెలిపారు. జూబ్లీ బస్ స్టేషన్ ను మోడల్ బస్ స్టేషన్ గా తీర్చి దిద్దడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఎమ్మెల్యే వెంట కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

    –sidhumaroju 

Exit mobile version