Home South Zone Telangana నిరుద్యోగ బాకీ కార్డు విడుదల.. ప్రభుత్వంపై ధ్వజం |

నిరుద్యోగ బాకీ కార్డు విడుదల.. ప్రభుత్వంపై ధ్వజం |

0

తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు గారు తీవ్రంగా స్పందించారు. ఇటీవల ఆయన “నిరుద్యోగ బాకీ కార్డు”ను విడుదల చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు.

“జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్‌లెస్ క్యాలెండర్” అంటూ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లపై విమర్శలు గుప్పించారు. ఉద్యోగాల బదులు మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

“జాబులు నింపమంటే జేబులు నింపుకున్నారు” అంటూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

NO COMMENTS

Exit mobile version