బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దృష్ట్యా, హోం మంత్రి వి. అనిత అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలకు ప్రభావితమయ్యే జిల్లాల్లో తక్షణమే కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, హెచ్చరిక బోర్డులు ఉంచాలని ఆదేశించారు.
NDRF, SDRF, పోలీస్, అగ్నిమాపక దళాలతో సహా అన్ని విపత్తు ప్రతిస్పందన బృందాలను (Disaster Response Teams) సిద్ధంగా ఉంచాలని సూచించారు.
క్షేత్రస్థాయి అధికారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.