రహదారులు నిర్మించండి
తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బురదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కాలనీవాసులు ఎన్ని పర్యాయాలు స్థానిక కౌన్సిలర్ మద్దమ్మతో కలిసి అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన కరువైనది గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ వర్షపు నీటితో గుంతల మయం అయ్యాయి దీంతో కాలనీవాసులు అందరూ కలిసి స్థానిక కౌన్సిలర్ తోపాటు చైర్మన్ జలపాల వెంకటేశ్వర్లు శ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు చైర్మన్ అక్కడికి చేరుకొని రహదారులు పరిశీలించి వెంటనే మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భర్త డ్రైవర్ మద్దిలేటి కాలనీ ప్రజలు పాల్గొన్నారు