ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 13,500 మంది మహిళా పోలీసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
వారు తమకు నచ్చిన శాఖను స్వయంగా ఎంచుకునే అవకాశం కల్పించింది. హోం శాఖ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేయాలా అనే ఎంపికను వారి చేతుల్లోకి అప్పగించింది. ప్రభుత్వం వారి అభిప్రాయాలను సేకరిస్తోంది. త్వరలోనే పదోన్నతులు, విధుల కేటాయింపు పై స్పష్టత రానుంది.
మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి, శాఖ ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. ఈ నిర్ణయం మహిళా పోలీసుల భవిష్యత్తుకు మేలు చేస్తుందని భావిస్తున్నారు.