ఖమ్మం జిల్లా:తెలంగాణలో అక్టోబర్ 4 నుండి 6 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్, రవాణా సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
రైతులు తమ పంటలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. వర్షాల సమయంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంచాలని జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టుతోంది.