Home South Zone Telangana జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దే విజయం విజయం: ఎమ్మెల్యే శ్రీ గణేష్

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దే విజయం విజయం: ఎమ్మెల్యే శ్రీ గణేష్

0

సికింద్రాబాద్ : కంటోన్మెంట్  ఉప ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని కంటోన్మెంట్ కాంగ్రెస్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రితో సహా పలువురు మంత్రులు జూబ్లీహిల్స్ లో ఇప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికే పట్టం కడతారని ఆశ భావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ప్రజలంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు.
Sidhumaroju

Exit mobile version