Home South Zone Telangana ఫేక్ ట్రక్ షీట్లతో బియ్యం దందా.. రూ.2 వేల కోట్ల దోపిడీ |

ఫేక్ ట్రక్ షీట్లతో బియ్యం దందా.. రూ.2 వేల కోట్ల దోపిడీ |

0

తెలంగాణలో రైస్ మిల్లర్ల భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పదేండ్లుగా ఫేక్ ట్రక్ షీట్లతో వడ్లు, బియ్యం సరఫరా చేసినట్టు చూపించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు.

కౌలు రైతుల కోసం ప్రభుత్వం అందించిన ఆప్షన్‌ను దుర్వినియోగం చేసి, కుటుంబ సభ్యులు, పరిచయస్తుల పేర్లను జతచేసి రూ. 2వేల కోట్లకు పైగా లూటీ చేశారు. వాస్తవంగా ధాన్యం లేకుండానే బియ్యం సరఫరా చేసినట్టు రికార్డులు చూపించి ప్రభుత్వ నిధులను దోచుకున్నారు.

ఈ స్కామ్‌పై విచారణ ప్రారంభమవుతోంది. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ఈ దందా ఖమ్మం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది.

Exit mobile version