Home Bharat Aawaz ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్ |

ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్ |

0

ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్
దీపావళి సందర్భంగా రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు జారీ చేసింది.
రైల్వే అధికారులు చెబుతున్నదేమిటంటే —ట్రైన్‌లో ప్రయాణించే సమయంలో ఎవ్వరూ మండే పదార్థాలు, పేలుడు పదార్థాలు, రైల్వే ఆస్తులకు హాని కలిగించే వస్తువులు తీసుకెళ్లరాదని కచ్చితంగా పాటించాలి.
ఇలా నిషేధిత వస్తువులు తీసుకెళ్తే, రైల్వే చట్టం 1989 ప్రకారం సెక్షన్ 164, 165 కింద చర్యలు తీసుకుంటారు.రూ.1000 వరకు జరిమానాలేదా 3 సంవత్సరాల వరకు జైలుశిక్షలేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.
భద్రత కోసం ప్రయాణికులందరూ ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలని రైల్వే అధికారులు సూచించారు.

NO COMMENTS

Exit mobile version