Home International ఉక్రెయిన్ శాంతికి ట్రంప్ ఫైనల్ హెచ్చరిక |

ఉక్రెయిన్ శాంతికి ట్రంప్ ఫైనల్ హెచ్చరిక |

0

ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండు గంటల పాటు ఫోన్ సంభాషణ జరిపిన ట్రంప్, యుద్ధాన్ని వెంటనే ఆపాలని స్పష్టం చేశారు.

తోమహాక్ క్షిపణుల సరఫరా, మాస్కో-వాషింగ్టన్ సంబంధాలపై తీవ్ర చర్చలు జరిగాయి. పుతిన్ హెచ్చరికల మధ్య ట్రంప్ శాంతి ఒప్పందం కోసం మరోసారి ప్రయత్నిస్తున్నారు.

బుడాపెస్ట్‌లో భేటీకి సిద్ధమవుతున్న ఈ నేతలు, యుద్ధ ముగింపుపై చర్చలు కొనసాగించనున్నారు. ఈ పరిణామాలు రష్యా-ఉక్రెయిన్ శాంతి ప్రక్రియకు కీలక మలుపు కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version