Home International రష్యా చమురు ఒప్పందంపై భారత్‌ వెనక్కి |

రష్యా చమురు ఒప్పందంపై భారత్‌ వెనక్కి |

0

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని, ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశం అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. భారత్‌ గతంలో 38% చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో మాస్కోపై ఒత్తిడి పెంచేందుకు భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంటుందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.

భారత్‌ మాత్రం ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. ఇంధన దిగుమతులు కస్టమర్ల ప్రయోజనాల ఆధారంగా ఉంటాయని స్పష్టం చేసింది.

NO COMMENTS

Exit mobile version