దీపావళి పండుగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్ మోసాలు ఊపందుకున్నాయి. ‘‘70% తగ్గింపు’’ అంటూ నకిలీ వెబ్సైట్లు, ఫేక్ లింకులు పంపిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
ఈ-మెయిల్, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా పంపిన ఆఫర్ లింకులు క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. హైదరాబాద్లో ఇప్పటికే వందల మంది మోసపోయినట్లు సైబర్ పోలీసులు వెల్లడించారు.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి పేర్లను వాడుతూ నకిలీ సైట్లు రూపొందించి, పటాకులు, గిఫ్ట్లు, డిస్కౌంట్ ఆఫర్ల పేరుతో డబ్బులు దోచుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వెబ్సైట్ల ద్వారానే కొనుగోలు చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.