సికింద్రాబాద్: బీసీ సంఘాల పిలుపుమేరకు ఈరోజు జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర బందులో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్. బీసీ బంద్ కు మద్దతు పలుకుతూ ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి బస్సులను బందు పెట్టారు. కార్మికులు డిపోలకు మాత్రమే పరిమితమయ్యారు. జూబ్లీ బస్ స్టేషన్ డిపోలో డ్రైవర్లు కండక్టర్లు ఆర్టీసీ కార్మికులను కలిసిన ఎంపీ ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సైతం ఆర్టీసీ పాత్ర మరువలేనిధి అని ఆయన అన్నారు. ఆర్టీసీకి దసరా పండుగ అంటే ఎక్కువ డబ్బులు వచ్చేది అయినా ఉద్యమ సమయంలో దసరా పండుగ సైతం బస్సులు బంద్ పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ప్రతి ఆర్టీసీ కార్మికులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు బిసి బందుకు మద్దతు తెలిపిన ఆర్టీసీ కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాలు మారిన ఆర్టీసీ కార్మికుల బ్రతుకులు మాత్రం మారడం లేదని హామీలు ఇవ్వడం తప్ప వాటిని నెరవేర్చడం లేదని వాటి మీద కూడా పోరాటం చేయాలని ఈటలని కోరుకున్న ఆర్టీసీ కార్మికులు.
Sidhumaroju