తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులకు శుభవార్త. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాలపై నేడు అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.
సీసీఐ ఎంపిక చేసిన 341 కేంద్రాల జాబితా మార్కెటింగ్ శాఖకు అందగానే, జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇందులో 328 కేంద్రాలు జిన్నింగ్ మిల్లుల్లో, మిగిలినవి మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 122 కేంద్రాలకు సంబంధించి జాబ్‌వర్క్ ఒప్పందాలు పూర్తయ్యాయి.
మిగిలిన కేంద్రాల ప్రక్రియ కూడా తుది దశలో ఉంది. ఈ నెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతులు మద్దతు ధరతో తమ పత్తిని విక్రయించేందుకు సిద్ధంగా ఉండాలి.