Home South Zone Telangana నవంబర్ 11న ఓటింగ్.. 14న ఫలితాల కౌంటింగ్ |

నవంబర్ 11న ఓటింగ్.. 14న ఫలితాల కౌంటింగ్ |

0

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక వేడి మొదలైంది. నేడు నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 24 వరకు గడువు ఉండగా, నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

జూబ్లీహిల్స్‌లో అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా మారే అవకాశం ఉంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version