హైదరాబాద్: తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై సమ్మెకు సిద్ధమయ్యాయి. నేడు అధికారికంగా సమ్మె నోటీసు జారీ చేయనున్నట్లు కళాశాలల ప్రతినిధులు ప్రకటించారు.
గత నాలుగేళ్లుగా ప్రభుత్వం బకాయిలను పూర్తిగా చెల్లించకపోవడంతో విద్యాసంస్థలు ఆర్థికంగా కష్టాల్లోకి వెళ్లాయి. దీపావళి ముందు రూ.300 కోట్ల చెల్లింపు హామీ ఇచ్చినప్పటికీ, అది అమలవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు మూతపడే అవకాశముంది.
విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విద్యాసంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి.