మంచిర్యాల: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల వరకు నీటి తరలింపుకు గ్రావిటీ మార్గం అనుసరించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
మైలారం నుంచి ఎల్లంపల్లికి తరలించాలంటే లిఫ్ట్ అవసరం కాగా, అదే నీటిని మైలారం నుంచి సుందిళ్లకు గ్రావిటీ ద్వారా తరలిస్తే రూ.8 వేల కోట్ల వరకు వ్యయాన్ని ఆదా చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ మార్గాన్ని పరిశీలించేందుకు ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తుమ్మిడిహెట్టి అలైన్‌మెంట్‌ను పరిశీలించనున్నారు.
ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించి తాజా DPR సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుందిళ్ల, మైలారం, తుమ్మిడిహెట్టి ప్రాంతాల్లో సాంకేతిక సర్వేలు కొనసాగుతున్నాయి.