Home Education ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు: సిలబస్‌లో మార్పులు |

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు: సిలబస్‌లో మార్పులు |

0

తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తప్పనిసరి చేశారు. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. అంతేకాకుండా, ఇంటర్ సిలబస్‌లో కొన్ని కీలక మార్పులు చేశారు.

పరీక్షా విధానంలో మార్పులు, మార్కుల పంపిణీ, ప్రాజెక్ట్ పనుల ప్రాధాన్యత వంటి అంశాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. tsbie.cgg.gov.in  వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు, సిలబస్ డౌన్‌లోడ్ లింకులు అందుబాటులో ఉన్నాయి.

NO COMMENTS

Exit mobile version