Home South Zone Telangana గురుపురబ్ ఉత్సవాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం |

గురుపురబ్ ఉత్సవాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం |

0

పంజాబ్ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ సంజీవ్ ఆరోరా గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ గుర్మీత్ సింగ్ కుడియన్ గారు కలిసి వచ్చే నెలలో జరగనున్న శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ అమరవీరుల వార్షికోత్స వేడుకల్లో (షహీది గురుపురబ్) పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం అందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఇతర ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ ఉత్సవాలు పంజాబ్ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనడం ద్వారా రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం మరింత బలపడనుంది.

Exit mobile version