మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 42% బి సి రిజర్వేషన్ కోసం ప్రాణత్యాగం చేసిన ఈశ్వర చారి కుటుంబాన్ని జగద్గిరిగుట్ట లో పరామర్శించిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ…
నా 25 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ అనుభవంలో విశ్వకర్మలు చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఇమ్మీడియేట్ గా స్పందించే నేచర్ ఉంటుంది.
దానికి తోడుగా అనేక రకాల బాధలు కూడా అనుభవిస్తూ ఉంటారు.
తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి ఎల్బీనగర్ చౌరస్తాలో ఆహుతై తెలంగాణ సమాజాన్ని తట్టి లేపారు.
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త జయశంకర్ కూడా విశ్వకర్మనే.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది.
ఒక రిజర్వేషన్ మాత్రమే కాకుండా అనేక రకాల హామీలు ఇచ్చారు.
42 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ల అమలు చేయాలని..
బీసీల జీవితాల్లో వెలుగు నింపాలని..
ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టే జ్యోతిబాపూలే సబ్ ప్లాన్ పేరిట పెడతామని..
ఇలా అనేక రకాల హామీలు ఇచ్చారు.
ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు.
చివరికి 42% రిజర్వేషన్ పేరట జరుగుతున్న డ్రామా తెలంగాణ సమాజాన్ని ఎలా తట్టి లేపిందో చూసాము.
బీసీలు బందుకు పిలిపిస్తే అన్ని పార్టీలు కూడా మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా ఎమోషనల్ అయ్యారు. అనేకమంది యువకులు విద్యార్థులు సోషల్ మీడియాలో ఏమేం పోస్టులు పెట్టారో చూసాము.
సాయి ఈశ్వర చారి….
తెలంగాణ ఉద్యమంలో అమరులైన విషయం గురించి మరి ముఖ్యంగా శ్రీకాంత్ చారి త్యాగం గురించి వీడియోలు చూసేవారు. ఈ మధ్యకాలంలో బీసీ ఉద్యమం తర్వాత.. త్యాగం చేయాలి అని చెప్పి అనేక సార్లు మాట్లాడేవాడు. చివరికి త్యాగానికి ఒడి కట్టడం యావత్ బీసీ సమాజన్నీ కలచివేసింది.
నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బిడ్డలను కోల్పోయి తెలంగాణ సాధించుకున్నాం. కానీ త్యాగాలు కాదు కావాల్సింది. మనం చనిపోవడం కాదు కావలసింది. కలిసికట్టుగా పోరాటం చేసే తత్వం ఉండాలి తప్ప ప్రాణత్యాగం చేయవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
తెలంగాణ ఉద్యమంలో ఈ పరంపర కొనసాగింది మళ్లీ ఈ పరంపర కొనసాగవద్దని కోరుతున్నాను.
అనేకమంది రాజకీయ నాయకులు, పార్టీలు బిసి పట్ల జరుగుతున్న అన్యాయం పట్ల.. వారి మీద జరుగుతున్న దాడిపట్ల సమాజం స్పందించే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా కూడా బలిదానాలకు ఒడిగట్టవద్దని తెలియజేస్తున్నాను.
ఈశ్వర చారి కుటుంబం.. ముగ్గురు చిన్న పిల్లలు.
వారి అత్త మాత్రమే ఉంది మామ కూడా లేడు.
పెళ్లి కానీ మరిది ఉన్నాడు.
కిరాయి ఇంట్లో ఉండి క్యాబ్ నడుపుకునే బిడ్డ.
వారి కుటుంబం పరిస్థితి చూస్తే దుఃఖం వస్తుంది.
ప్రభుత్వం తక్షణమే వారికి ఆర్థిక సాయం చేయాలి.
వారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలి.
చిన్న పిల్లల కాబట్టి పోషణ కోసం ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.
జిల్లా కలెక్టర్ తో మాట్లాడి జగద్గిరిగుట్టలో ఖాళీ జాగా ఇప్పించి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను.
ఇలాంటి త్యాగాల సందర్భంలో తెలంగాణ సమాజం ఊరికి ఉండదు తప్పకుండా స్పందించే తత్వం ఉంటుంది.
నిన్ననే విశ్వకర్మలంతా తెలంగాణ అంతా వారి వారి వృత్తులను బంద్ చేసుకొని.. యావత్ బీసీలను ఐక్యం చేయడంలో వారిలో స్ఫూర్తిని నింపనంలో తోడ్పాటు అందించారు.
యావత్ బిసి సమాజం వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నా.
నేను ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడుగా వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం.
ఈ మరణం సాక్షిగా ఈ జాతిలో ఐక్యత, చైతన్యం వస్తుందని.. ఆశయాన్ని ముద్దాడే వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తున్నాను.
ఈటల రాజేందర్ గారితో పాటు మేడ్చల్ అర్బన్ జిల్లా జనరల్ సెక్రెటరీ గిరివర్ధన్ రెడ్డి,
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్, శేఖర్ యాదవ్, జగదిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు పున్నారెడ్డి, వాసు, కట్ట కుమార్, అత్విక్ యాదవ్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
#Sidhumaroju
