భారత క్రికెట్ జట్టు మధ్య క్రమ బాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ రెడ్-బాల్ క్రికెట్ నుంచి ఆరు నెలల విరామం తీసుకున్నట్లు వెల్లడించారు.
టెస్టు జట్టులో తిరిగి చేరే అవకాశాలు ఉన్న సమయంలో, బీసీసీఐకి విరామం కోరుతూ విజ్ఞప్తి చేశారు. IPL తర్వాత రెడ్-బాల్ మ్యాచ్‌లలో ఫీల్డింగ్ సమయంలో తన శారీరక శక్తి తగ్గిపోతుందని, అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన ఇన్‌టెన్సిటీని కొనసాగించలేకపోతున్నానని ఆయన తెలిపారు.
ODIలలో విశ్రాంతి లభిస్తుందని, కానీ టెస్టుల్లో అది సాధ్యం కాదని చెప్పారు. తన బ్యాటింగ్ స్టాన్స్‌ను uprightగా మార్చడం ద్వారా bounce ఉన్న పిచ్‌లపై తాను మెరుగ్గా ఆడగలిగానని వివరించారు. ముంబైలోని రెడ్-సాయిల్ పిచ్‌లపై కూడా ఈ టెక్నిక్ ఉపయోగపడిందని అన్నారు.
