Home Sports టీ20లో ద్విశతకం! 17 సిక్స్‌లు కొట్టి అదరగొట్టిన కాటేరమ్మ కొడుకు |

టీ20లో ద్విశతకం! 17 సిక్స్‌లు కొట్టి అదరగొట్టిన కాటేరమ్మ కొడుకు |

0

టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను భారత బ్యాట్స్‌మన్ సుబోధ్ భాటి సాధించాడు. ఇంటర్-క్లబ్ టీ20 మ్యాచ్‌లో అతడు కేవలం 79 బంతుల్లో అజేయంగా 205 పరుగులు చేసి సంచలన రికార్డు సృష్టించాడు.
17 ఫోర్లు, 17 సిక్సర్లు బాది 259 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో 170 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం.

ఢిల్లీ ఎలెవన్ తరఫున ఆడిన భాటి, జట్టు చేసిన మొత్తం 256 పరుగుల్లో 80 శాతం ఒక్కడే సాధించాడు. ప్రత్యర్థి సింబా జట్టు 199 పరుగులకే ఆలౌట్ కావడంతో ఢిల్లీ ఎలెవన్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది.

NO COMMENTS

Exit mobile version