తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి పర్యటించనున్నారు. పార్టీ అగ్రనేతలతో సమావేశమై రాష్ట్ర పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై సమీక్ష జరగనుంది.
ముఖ్యంగా జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర నేత మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు.
పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం కీలకంగా మారనుంది. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఈ సమావేశం ఉండనుందని నేతలు భావిస్తున్నారు.
