కర్నూలులో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో 289 కేసులు నమోదు చేశారు. బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ లైసెన్స్, ప్రయాణ భద్రతా ప్రమాణాలు, బీమా వివరాలు వంటి అంశాలపై అధికారులు కఠినంగా పరిశీలించారు.
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రవాణా శాఖ చర్యలతో ప్రయాణికుల్లో భద్రతపై విశ్వాసం పెరుగుతోంది.
