కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఆస్పరి మండలంలోని ఏ.జి రోడ్డు నుంచి శంకరబండ, చిప్పగిరి మండలంలోని నెమకల్ నుంచి సంగాల, హొళగుంద మండలంలోని హొళగుంద మార్లమడికి నుంచి నగరకన్వి వరకు మొత్తం రూ.3.37 కోట్లతో 4.22 కిలోమీటర్లకు గ్రామాల రోడ్ల నుంచి రహదారుల అనుసంధానానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రతిపాదనలు పంపారు…
కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో ఎంపీ నాగరాజు పంచాయతీ రాజ్ శాఖ ఎస్.ఈ వేణుగోపాల్ గారి తో పి.ఎం.జి.ఎస్.వై పథకం పై సమీక్షించారు…ఈ సందర్బంగా జిల్లాలో రహదారులకు అనుసంధానం లేని గ్రామీణ ప్రాంత రోడ్లను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఎంపీ ,ఎస్.ఈ గారిని కోరారు…
ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ గ్రామీణ రోడ్లకు రహదారులను అనుసంధానం చేస్తే పల్లె ప్రజలకు ఉపాధి, విద్య మరియు ఇతర సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావచ్చని తెలిపారు..ఈ కార్యక్రమంలో పంచాయతీ శాఖ ఈ.ఈ కరెన్న రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు..



