వనితల వన్డే వరల్డ్ కప్ 2025 నాకౌట్ దశకు రంగం సిద్ధమైంది. న్యూజిలాండ్‌పై 53 పరుగుల విజయంతో భారత మహిళల జట్టు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లతో కలిసి చివరి నాలుగు జట్లలో చోటు సంపాదించింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లు అక్టోబర్ 29న గౌహతి, అక్టోబర్ 30న నవి ముంబై DY పాటిల్ స్టేడియంలో జరగనున్నాయి.
భారత్ తన గ్రూప్ దశలో శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించినప్పటికీ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా చేతిలో ఓటములు ఎదుర్కొంది. చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు చేరింది.




 
                                    
