తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి తన వ్యక్తిగత హక్కులను కాపాడుకునేందుకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఆయన అనుమతి లేకుండా పేరు, ఫొటో, వాయిస్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్న డిజిటల్ సంస్థలు, బ్రాండ్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై స్పందించిన కోర్టు, చిరంజీవి వ్యక్తిగత హక్కులను పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. AI, మెటావర్స్ వంటి డిజిటల్ వేదికల్లో ఆయన రూపాన్ని అనధికారికంగా వినియోగించకుండా నిరోధించేందుకు ఈ ఉత్తర్వులు కీలకంగా మారాయి.
అక్టోబర్ 27న తదుపరి విచారణ జరగనుంది. ఈ ఉత్తర్వులు సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
