గూడూరు పట్టణంలోని కేజీబీవీ స్కూల్లో విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా మలేరియా అధికారి కే జి బి వి స్కూల్ ప్రిన్సిపాల్ జరినాకు సూచించారు శనివారం జిల్లా మలేరియా అధికారి కేజీబీవీ స్కూల్ ను సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా కేజీబీవీ స్కూల్ లోని వంట గదులను వంట పరికరాలను అలాగే విద్యార్థులకు అందించే ఆహారాలను అలాగే విద్యార్థుల తరగతులను పరిసర ప్రాంతాలను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విష జ్వరాల అలాగే డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నెలకు ఒకసారి స్థానిక వైద్యాధికా రూలతో వైద్య పరీక్షలు చేయించాలని అని అన్నారు అలాగే విద్యార్థులు త్రాగే నీరు కలుషం లేకుండా వడపోసి తాగేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య విషయాలను తెలుసుకొని అవసరమైన మందులను అందించాలని వారికి సూచించారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించి సురక్షితమైన నీరును అందించాలని కేజీబీవీ స్కూల్ సిబ్బందిని ఆదేశించారు ఈయన వెంట స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రత్యూష ఉన్నారు
విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలి జిల్లా మలేరియా అధికారి నూకరాజు
RELATED ARTICLES




