Sunday, October 26, 2025
spot_img
HomeSouth ZoneTelanganaప్రపంచ శాంతి కోసమే క్రైస్తవ ఉజ్జీవ సభనలు: ఎమ్మెల్యే శ్రీ గణేష్

ప్రపంచ శాంతి కోసమే క్రైస్తవ ఉజ్జీవ సభనలు: ఎమ్మెల్యే శ్రీ గణేష్

సికింద్రాబాద్: కంటోన్మెంట్|  మడ్ ఫోర్డ్ హాకీ గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి కోసం ఫాదర్ జార్జ్  ఆధ్వర్యంలో, ప్రఖ్యాత ప్రభోదకులు ఫాదర్ బెర్క్ మెన్స్  ప్రబోధనలతో ఉజ్జీవ సభలు నిర్వహిస్తున్నారు.ఈ ఉజ్జీవ సభలకు నిర్వాహకుల ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ కి ప్రభోధకులు ఆశీర్వచనం ఇచ్చారు.ఈ ఉజ్జీవ సభలను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీగణేష్  మాట్లాడుతూ భారత దేశం అన్ని మతాలను గౌరవిస్తుందని,అన్ని మతాలు సమానమేనని, అన్ని మతాలవారు కలిసిమెలసి జీవిస్తేనే ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సౌభ్రాతృత్వాలు పరిఢవిల్లుతాయని చెప్పారు.ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలసి ప్రార్ధన చేస్తారో అక్కడ ఏసుప్రభువు ఉఃటాడనే నమ్మకం ఉంటుందని, ఈరోజు ఇక్కడ ఇంతమంది ఒకేచోట ప్రార్ధన చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏసుప్రభువు ఇక్కడ మనందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారని, ప్రేమ, శాంతి,క్షమ గుణాలతో ఉండాలని ఏసుక్రీస్తు చెప్పేవారని బైబిల్ చెప్తుందని,మనందరం ఏసుక్రీస్తు బోధనలను పాటిస్తే ప్రపంచమంతా శాంతి , సౌభ్రాతృత్వలతో వర్ధిల్లంతుందని చెప్పారు.ఈ సభలలో పాస్టర్లు జూలియస్, అరుణ్, దినకరన్, ఆనంద్, సాల్మన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments