తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్సుల కోసం లాటరీ ప్రక్రియ నేడు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం షాపుల కోసం మొత్తం 95,137 దరఖాస్తులు అందాయి.
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి అన్ని జిల్లాల్లో లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ జిల్లాలో 82 షాపులకు 3,201 దరఖాస్తులు, సికింద్రాబాద్‌లో 97 షాపులకు 3,022 దరఖాస్తులు, వికారాబాద్‌లో 100 షాపులకు 8,536 దరఖాస్తులు అందాయి.
లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అభ్యర్థుల సమక్షంలో కంప్యూటరైజ్డ్ డ్రా చేపడుతున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఈ ప్రక్రియ ద్వారా రూ.2,854 కోట్ల ఆదాయం పొందింది. హైదరాబాద్ జిల్లాలో లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.




