కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వి కావేరి ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్‌ను ఏ1గా, యజమానిని ఏ2గా నిందితుల జాబితాలో చేర్చారు.
రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. డ్రైవర్‌తో పాటు యజమానిపై BNS 125(a), 106(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడేలా చేసిన ఈ ఘటనపై కర్నూలు జిల్లా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.




