Home South Zone Telangana ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమి కబ్జా |

ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమి కబ్జా |

0
1

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల శివారు 115/4 సర్వే నంబర్‌లో రిటైర్డ్ పోలీస్ అధికారి 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

రూ. 10 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్లు, ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్ ద్వారా చట్టబద్ధంగా మార్చినట్లు సమాచారం. అనంతరం ప్లాట్లు చేసి విక్రయించినా, సంబంధిత యంత్రాంగం స్పందించకపోవడం గమనార్హం.

ఈ వ్యవహారంపై జిల్లా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. భూముల కబ్జా, నకిలీ పత్రాల వ్యవహారంపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా భూ వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.

NO COMMENTS