తుఫాన్ “మొంథా” ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో తుఫాన్ తీవ్రత, సహాయ చర్యలు, కేంద్ర సహకారం తదితర అంశాలపై ఇద్దరూ చర్చించారు.
ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. కేంద్రం నుంచి SDRF, NDRF బృందాల మోహరింపు, నిధుల మంజూరు వంటి అంశాలపై ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం.
విశాఖపట్నం జిల్లాలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, కేంద్రం ప్రత్యేక దృష్టి సారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 27 వేల సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేసింది. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించనున్నారు.




