హైదరాబాద్: జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు షాక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో చిన్న శ్రీశైలం యాదవ్‌ను బైండోవర్ చేసిన పోలీసులు. చిన్న శ్రీశైలం యాదవ్‌తో పాటు మరో వంద మంది రౌడీ షీటర్ల బైండోవర్. మదూర నగర్ పీఎస్‌లో చిన్న శ్రీశైలం యాదవ్, అతడి సోదరుడు రమేష్ యాదవ్‌తో సహా 19 మంది.. బోరబండ పీఎస్‌లో 74 మంది రౌడీ షీటర్ల బైండోవర్. ఎన్నికల వేళ రౌడీ షీటర్ల కదలికలపై నిఘా. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న పలువురు రౌడీ షీటర్లపై చర్యలు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులు.
Sidhumaroju




