జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో MIM పార్టీ పోటీ చేయకపోవడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణకు పట్టిన చీడ MIM” అంటూ ఆయన ఆరోపించారు. స్లాటర్ హౌస్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారని, 39 స్లాటర్ హౌస్‌లపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఈ స్లాటర్ హౌస్‌ల వెనుక MIM నేతలే ఉన్నారని ఆరోపిస్తూ, మజ్లిస్ అరాచకాలను ఆపాలంటే జూబ్లీహిల్స్‌లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, BRS, MIM పార్టీలు ప్రజల సంక్షేమం కోసం కాకుండా, కుటుంబ రాజకీయాల కోసం పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు.
నవంబర్ 11న జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాఖ్యలు హైదరాబాద్, జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.




 
                                    
