Home Entertainment ఓటీటీలో కొత్తలోక, OG.. వీటిని మిస్సవద్దు !

ఓటీటీలో కొత్తలోక, OG.. వీటిని మిస్సవద్దు !

0

అక్టోబర్ చివరి వారం తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు పండుగలా మారింది. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ‘కొత్తలోక: చాప్టర్ 1’ ఇప్పుడు Jio Hotstar వేదికగా అక్టోబర్ 31 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాళీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

మరోవైపు, ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇడ్లీ కొట్టు’ చిత్రం Netflix వేదికగా అందుబాటులో ఉంది. ఇందులో ధనుష్ తన తండ్రి వారసత్వంగా వచ్చిన ఇడ్లీ హోటల్‌ను నడిపే సాధారణ వ్యక్తిగా కనిపిస్తాడు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ‘They Call Him OG’ చిత్రం Netflix వేదికగా అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్‌లో ఉంది.

ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను విభిన్నమైన కథాంశాలతో అలరించనున్నాయి. వీటితో పాటు Param Sundari, Kurukshetra 2 వంటి ఇతర భాషా చిత్రాలు కూడా ఈ వారం విడుదల కానున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

NO COMMENTS

Exit mobile version